ETV Bharat / state

ప్రచారానికి ముందు వెంకన్న దర్శనం - TML BABU SENTIMENT

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు చంద్రబాబు తిరుమలకే ఎందుకెళ్తారు..?. శ్రీవారంటే ఎందుకంత సెంటిమెంట్..? ఈసారి ప్రచారాన్ని శ్రీకాకుళం నుంచే ఎందుకు ప్రారంభిస్తున్నారు.? చంద్రబాబు దేవుళ్లతోపాటు వాస్తునూ నమ్ముతారా?

ప్రచారానికి ముందు వెంకన్న దర్శనం
author img

By

Published : Mar 16, 2019, 6:00 PM IST

Updated : Mar 16, 2019, 7:24 PM IST

శ్రీవారి దర్శనం తర్వాతే ప్రచారం

ప్రచారానికి ముందు తిరుమలకు వెళ్లడం ఆనవాయితీ

ముఖ్యమంత్రి చంద్రబాబుకి హైటెక్ బాబుగా పేరుంది. ఇంత వరకే అందరికి తెలుసు. ఆయనకూ దేవుళ్లు, ముహుర్తాలు, నమ్మకాలు, సెంటిమెంట్లు ఎక్కువే. తిరుమల శ్రీవారంటే మహాభక్తి. కలియుగ ప్రత్యక్షదేవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి ఏ పని తలపెట్టిన విజయవంతం అవుతుందనేది చంద్రబాబు విశ్వాసం. ప్రతి ఎన్నికల్లో శ్రీవారిని దర్శించుకుని ప్రచారం ప్రారంభించడం అనవాయితీగా వస్తోంది. ఈసారీ కూడా సంప్రదాయం కొనసాగించారు. అమరావతి నుంచి నేరుగా తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

ఎదురొచ్చి హారతిచ్చిన భువనేశ్వరి
తిరుపతికి బయలుదేరే ముందు తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారాయన. అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య భువనేశ్వరి ఎదురొచ్చి చంద్రబాబుకు హారతిచ్చారు.

శ్రీకాకుళం నుంచే ఎందుకు..?
వాస్తు ప్రకారం శ్రీకాకుళం రాష్ట్రానికి తూర్పు దిక్కున్న ఉండటంతో తిరుపతి నుంచి శ్రీకాకుళం వెళ్లి అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్నిలాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈనెల 17 నుంచి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మిషన్‌ 150 ప్లస్‌ నినాదంతో వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచార సభల్లో పాల్గొంటారు.

శ్రీవారి దయతోనే..
2003లో అలిపిరి ప్రమాదం నుంచి చంద్రబాబునాయుడు బయటపడ్డారు. ఏడుకొండలవాడి దయతోనే తాను మృత్యువు నుంచి తప్పించుకున్నానని పదే పదే చెబుతుంటారు. దిల్లీలో ముఖ్యనేతలను కలిసినా తిరుమల ప్రసాదాన్ని, శ్రీవారి ఫొటోను బహుమతిగా ఇస్తుంటారు చంద్రబాబు.

లక్కీ నెంబర్ 9
చంద్రబాబు లక్కీ నెంబర్‌ తొమ్మింది. ఈ విషయాన్ని చంద్రబాబే అంగీకరించారు. దీనికి తగ్గట్టుగా 126 మంది అభ్యర్థులను ప్రకటించారు. 1+2+6 ఈ అంకెల్ని కలిపితే తొమ్మిదే వస్తుంది. . 126 మంది అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా ఈ సంగతి చెప్పుకొచ్చారు. చంద్రబాబు కాన్వాయ్​కి 393 నెంబర్ ఉంటుంది. ఆయన అదృష్ట సంఖ్య 9 మధ్యలో వచ్చేలా ఆ నెంబర్​నే ఎంచుకున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 16, 2019, 7:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.