తిరుపతిలో ప్రపంచకప్ హీట్ కనిపిస్తోంది. వర్షం కారణంగా మ్యాచ్లు రద్దు అవుతున్న తరుణంలో... భారత్-పాక్ మ్యాచ్కు వరుణ గండం ఉందని వార్తలు వచ్చాయి. వరుణ దేవుడు కరుణించాలంటూ తిరుపతిలో క్రికెట్ అభిమానులు వినూత్న రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద మోకాళ్లపై నిలబడి వరుణుడు కరుణించాలంటూ ప్రార్థనలు చేశారు. పాదాల మండపం వద్ద కొబ్బరి కాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భారత్ పాక్తో మ్యాచ్ గెలవాలని... ప్రపంచ కప్ సొంతం చేసుకోవాలని తిరుమలేశుడిని వేడుకున్నారు.
ఇదీ చదవండిః ఇష్టం మనది.. కష్టం నాన్నది