ETV Bharat / state

నెలాఖరులోగా అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ...!? - undefined

త్వరలో మొదలు కానున్న విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా కోర్సుల అనుమతి ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ త్వరలో కొలిక్కి రానుంది. ఈ నెలాఖరున కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలయ్యే లోపు విశ్వవిద్యాలయాలు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి.. విద్యార్థులకు అందుబాటులో ఉండే కాలేజీలు, సీట్లను ప్రకటించే అవకాశం ఉంది.

నెలాఖరులోగా అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ
author img

By

Published : Jun 7, 2019, 12:20 PM IST

నెలాఖరులోగా అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు... అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతుల ప్రక్రియ పూర్తి చేసింది. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 214 ఇంజినీరింగ్ కాలేజీల్లో లక్ష 8వేల 175 సీట్లకు సాంకేతిక విద్యా మండలి అనుమతినిచ్చింది. వాటిలో 14 కాలేజీల్లో 3వేల 55 సీట్లు ఉండగా... 200 ప్రైవేట్ కాలేజీల్లో లక్షా 5వేల 120 సీట్లు ఉన్నాయి. బీఫార్మసీలో మూడు ప్రభుత్వ కాలేజీల్లో 180 సీట్లు... 124 ప్రైవేట్ కళాశాలల్లో 10వేల 762 సీట్లకు ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంబీఏలో 19 ప్రభుత్వ కళాశాలల్లో 1290... 303 ప్రైవేట్ కాలేజీల్లో 41 వేల 49 సీట్లు... ఎంసీఏలో 13 ప్రభుత్వ కళాశాలల్లో 570, 36 ప్రైవేట్ కాలేజీల్లో 2వేల 721 సీట్లకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలోని 60 ప్రైవేట్ కాలేజీల్లో 1770 ఫార్మా డీ సీట్లకు ఏఐసీటీఈ అనుమతినిచ్చింది.

యూనివర్సిటీల అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఏఐసీటీఈ అనుమతి ఉన్నప్పటికీ... యూనివర్సిటీలు పలు కాలేజీలు, కోర్సులకు కోత విధిస్తున్నాయి. జేఎన్ టీయూహెచ్, ఓయూ, కేయూ, మహాత్మగాంధీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, వెటర్నరీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీలు వివిధ కాలేజీలు, కోర్సులకు గుర్తింపునిచ్చేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఎంసెట్, ఐసెట్ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ నెలాఖరున కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ లోపు....యూనివర్సిటీలు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి.. విద్యార్థులకు అందుబాటులో ఉండే కాలేజీలు, సీట్లను ప్రకటించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: దర్జాగా వచ్చాడు... ఫోనెత్తుకెళ్లాడు..

For All Latest Updates

TAGGED:

aicte
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.