భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 6 వ మైలు వద్ద రెండు లారీలు ఢీకొని ప్రమాదం జరిగింది. ఘటనలో ఒక లారీ అదుపు తప్పి లోయలో పడగా.. లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి.
స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.