ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా, భద్రాద్రి శతక కవి చిగురు మల్ల శ్రీనివాస రావు సంయుక్త ఆధ్వర్యంలో అమ్మ, నాన్న, గురువు శతక పద్యర్చన జనవరి 6న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు తానా సన్నద్ధమవుతోంది. తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ న్యూయార్క్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చిగురు మల్ల శ్రీనివాస రావు రచించిన అమ్మ శతకం, నాన్న శతకం, గురు శతకంలోని పద్యాలను లక్షల మంది విద్యార్థులు కంఠస్థం చేసి సామూహిక గానం చేయనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక వంటి రాష్ట్రాలతో పాటు అమెరికా వంటి దేశాల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. తల్లిదండ్రులు గురువుల పట్ల ఈతరం బాలబాలికల్లో అభిమానం ప్రేమ, గౌరవం కలిగించే ఈ పద్యర్చన మానవీయ విలువలు పరిరక్షణలో ముందడుగుగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదని తెలిపారు.
ఇదీ చూడండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రాజౌరి జిల్లాలో ఐఈడీ గుర్తింపు