భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి కోయగూడెం ఉపరితల బొగ్గు గనులకు వెళ్లే వారికి భౌతికదూరం పాటిస్తూ విధులకు హాజరయ్యేలా తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ నాయకులు, కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేనేజర్ జీవన్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఒకవైపు కరోనా విజృంభిస్తోన్న తరుణంలో సింగరేణి కార్మికులు భయాందోళన మధ్య విధులు నిర్వహిస్తున్నారని రవాణా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని షిఫ్టుల కార్మికులు విధులకు హాజరయ్యే విధంగా యాజమాన్యం బస్సులు నడపాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్, టీబీజీకేఎస్ ఎస్వీఎస్ ఎన్. రాజు, రాంబాబు, కృష్ణ, బాలాజీ, రామారావు, ఖాదర్, వెంకట నర్సయ్య, షబ్బీర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన