భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన సెంటర్లలో గల విగ్రహాలను తొలగిస్తున్నారు. విగ్రహాల వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో.. వాటిని మరో చోటికి మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మరోవైపు పట్టణంలో డ్రైనేజీల ఆక్రమణలను తొలగించి రహదారుల విస్తరణపైనా దృష్టి సారించారు. వర్షాకాలంలో ప్రధాన రహదారిపై నీరు నిల్వ లేకుండా చేస్తున్న అధికారులు.. విగ్రహాల తొలగింపు కార్యక్రమంతో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించే చర్యలకు పూనుకున్నారు.