ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు బయటకు వస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా నూతన శానిటేషన్ యంత్రాన్ని ప్రారంభించారు.
వీధుల్లో స్వయంగా మందును పిచికారీ చేశారు. ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందిగా కోరారు.
ఇదీ చూడండి : మనం ఇంట్లో ఉండటమే వారికిచ్చే బహుమతి