భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే హరిప్రియ సన్మానించారు. కార్మికులను శాలువాలతో సత్కరించి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు, కమిషనర్ శ్రీనివాసరెడ్డి, బొగ్గుగని కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అనంతరం పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే... అంటువ్యాధులు ప్రబలకుండా నీటి నిల్వలను ప్రతీ ఆదివారం ఖాళీ చేసి శుభ్రపరుచుకోవాలని సూచించారు. మండలంలోని పలు పంచాయతీలలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.