భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జరిగిన 67వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చివరి రోజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ కవిత, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పురషుల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజేతలవగా... మహిళా విభాగంలో నల్గొండ జిల్లా విజయం సాధించింది.
నాలుగు రోజుల పాటు జరిగిన క్రీడలు విజయవంతం కావడాన్ని మంత్రి అభినందించారు. క్రీడలు నిర్వహించిన జిల్లాలోనే అదే జిల్లా బహుమతి సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బహుమతుల ప్రదానం చేశారు.
ఇవీ చూడండి: మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!