భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని జీయర్ మఠంలో చిన్నజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం రాత్రి భద్రాద్రికి చేరుకున్న చిన్నజీయర్ స్వామి ఈరోజు ఉదయం జీయర్ మఠంలో పెరుమాళ్లుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తీర్థగోష్టి నిర్వహించి మఠం వద్దకు వచ్చిన భక్తులకు తీర్థం అందించారు. తర్వాత చిన్న జీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామితో కలిసి భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.
ఇవీ చూడండి: ప్రకృతిపై ప్రేమ .. ఇంటి పైకప్పుపై 400 మొక్కల పెంపకం