కాంగ్రెస్ ఎన్నికలకు భయపడదని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సిద్ధంగా ఉంటుందని జిల్లా కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కర్త నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ టీఎన్జీఓ భవనంలో కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ పురపోరులో కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని నిరంజన్ రెడ్డి సూచించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే...