ఆదిలాబాద్లో సుందరయ్య భవన్ నుంచి ఆర్టీసీ డిపో వరకు కార్మికులు ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నల్ల బ్యాడ్జీలతో డిపో ఎదుట నిరసన తెలిపారు. ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులపై విచక్షణరహితంగా పోలీసులు లాఠీచార్జీ చేశారని ఆరోపించారు. ఆర్టీసీ ఐకాస నేతలను వెంటనే చర్చలకు పిలవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: ఆర్టీసీపై రేపు విచారణ... ఇవాళ సీఎం సమీక్ష!