ఆదిలాబాద్ పట్టణం బస్టాండ్ సమీపంలోని నడి రోడ్డుపై రియల్టర్ దారుణ హత్య కలకలం రేపింది. ఈ ఘటనలో బేల మండల కేంద్రానికి చెందిన అమూల్ కుమార్ మృతి చెందారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
గతంలో ఆయన దగ్గర పనిచేసిన అన్నదమ్ములైన దిలీప్‌సింగ్ షేకావత్, గోపాల్ సింగ్ షేకావత్ హత్యచేసినట్లు ఆయన వెల్లడించారు. అక్రమంగా ప్లాట్లు విక్రయించిన విషయంలో అమూల్ కుమార్ రూ. 35లక్షలు చెల్లించకుండా అన్నదమ్ములను ముప్పుతిప్పలుపెట్టాడని పేర్కొన్నారు. పైగా ఆ ప్లాట్లు కొనుగోలుచేసిన బాధితులు నిందితులపై ఒత్తిడితేగా.. అమూల్కుమార్కు సంబంధం లేదన్నట్లు చేతులెత్తేయటం వల్ల హత్యకు దారితీసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులతో పాటు వారు ఉపయోగించిన రెండుకత్తులను స్వాధీనంచేసుకున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: చిల్లర రాజకీయాలతో పార్టీకి చెడ్డపేరు తేవొద్దు: తుమ్మల