వచ్చే పురపాలక ఎన్నికల్లో పైరవీలకు తావులేకుండా గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయిస్తామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస, ఎంఐఎం పార్టీలు పురపాలక ఎన్నికల్లో లబ్ధి కోసమే ముస్లింలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.
ఇలాంటి అసంఘటిత శక్తులను ఎదుర్కొనేందుకు హిందువులు జాగృతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జోగు రామన్న.. తన స్థాయిని మరిచి ప్రధానిని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: కిమ్ క్రిస్మస్ 'కానుక'పై ట్రంప్ చమత్కారం