ఆదివాసీ ఉద్యమమే కేంద్రంగా...
ఈ పార్లమెంటు పరిధిలో ఏడు శాసనసభ స్థానాల్లో... బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వు స్థానాలు. బోథ్, ఖానాపూర్ నుంచి తెరాస అభ్యర్థులు రోఠోడ్ బాపూరావు, రేఖానాయక్ విజయం సాధించగా... ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిచారు. తరువాత సక్కు కూడా తెరాసకు మద్దతిచ్చారు. గతంలో ఆదివాసీ ఓట్లు చీలిపోవడం వల్లనే లంబాడీ తెగకు చెందిన నాయకుడు గెలిచారని... ఈసారి అలా జరగకుండా తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
అయిదేళ్లుగా ఎంపీగా పనిచేసిన గోడం నగేష్... ఆదివాసీ గూడేల్లో పర్యటించలేదనే విమర్శ ఉంది. జిల్లాలో పురుడు పోసుకున్న ఆదివాసీ ఉద్యమానికి మద్దతివ్వలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. శాసనసభ ఎన్నికల సమయంలో నేతల మధ్య ఏర్పడ్డ విభేదాలతో పార్టీలోనూ అభిప్రాయభేధాలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఐక్యతప్రదర్శించినా...లోలోపల ఎవరి దారి వారిదే అన్నట్లుగా మారింది. ఉద్యమానికి నాయకత్వం వహించిన సోయం బాబూరావు ఆదివాసీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గోడం నగేష్, సోయం బాపురావు ఆదివాసీ ఓట్ల కోసం పోటీ పడుతుండగా... రమేష్ రాఠోడ్ లంబాడ ఓట్లు చీలకుండా పావులు కదుపుతున్నారు.
ఇవీ చూడండి:కరీంనగర్ బరిలో గెలిచే ఉద్యమ వీరుడెవరో?