ETV Bharat / sports

కష్టాలను వెనక్కినెట్టి.. ఆటల్లో అద్భుతాలు సృష్టించి...

కష్టాలు, కన్నీళ్లు వాళ్లని వెనక్కిలాగాలనుకుంటే...  పట్టుదల ముందుకు నడిపించింది. మేకలు కాసే తల్లి కలను నిజం చేసేందుకు ఒకరు.. అమ్మానాన్న లేకున్నా అవ్వ దగ్గర పెరిగి మరొకరు..  సాధించగలవని వెన్ను తట్టిన తాత కల నెరవేర్చేందుకు ఇంకొకరు... ఆటల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు... టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన పేదబిడ్డల స్ఫూర్తి కథనాలివీ...

Tamil girls at the Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్​లో తమిళ యువతులు
author img

By

Published : Jul 8, 2021, 3:22 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్‌ పోటీల్లో 4 X 400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పరుగు పందెంలో పాల్గొనేందుకు తమిళనాడు నుంచి ముగ్గురమ్మాయిలు అర్హత సాధించారు.

ధనలక్ష్మీ

వారిలో ఒకరు తిరుచ్చికి చెందిన ధనలక్ష్మి. కాళ్లలో చక్రాలున్నట్టుగా పరుగులు పెట్టే ఆమెని తండ్రి పరుగులో ప్రోత్సహించాడు. ఏడేళ్ల క్రితం ఆయన మరణించడంతో ఆ కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. అప్పట్నుంచీ తల్లే ఆమెకు అండా దండా. ఆవులు, మేకలు పెంచగా వచ్చిన డబ్బుతో అవసరమైన షూస్‌ వంటివి కొనిచ్చింది. ఉన్న కొద్దిపాటి బంగారు నగలనీ కుదువపెట్టింది. ధనలక్ష్మితో పాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లనీ చదివిస్తోంది. ఆ తల్లి కష్టం వృథా పోలేదు. పరుగుల రాణి పీˆటీ ఉష రికార్డునే బద్దలుకొట్టింది ధన. ఉష 200 మీటర్ల దూరాన్ని 23.30 సెకన్లలో పూర్తి చేస్తే ఈమె ఆ దూరాన్ని 23.26 సెకన్లలోనే దాటేసింది. ద్యుతిచంద్‌, హిమదాస్‌ వంటి హేమాహేమీలను వెనక్కు నెట్టింది. తాజాగా జరిగిన జాతీయ స్థాయి పరుగు పందెంలో 100 మీటర్లను 11.38 సెకన్లలో పూర్తిచేసి బంగారు పతకాన్ని సాధించింది. అమ్మాయిలు టీషర్ట్‌ వేసుకుంటే నోళ్లు నొక్కుకొనే ఊర్లో... ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా అమ్మ ఇచ్చిన ధైర్యంతో ఎదిగి ఇప్పుడు రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.

మధురై నుంచి టోక్యో వరకు

రేవతి వీరమణి

కాళ్లు బొబ్బలెక్కుతున్నా... ఒట్టి కాళ్లతోనే సాధన చేసింది మధురైకి చెందిన 22ఏళ్ల రేవతి వీరమణి. చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోతే.. అవ్వ చేరదీసి పెంచింది. రెండో తరగతి నుంచి ప్లస్‌టూ వరకు హాస్టల్‌లో ఉండి చదువుకొన్న రేవతికి పరుగంటే అమితాసక్తి. ప్లస్‌టూలో 100 మీటర్ల పోటీలో కాళ్లకు షూ కూడా లేకుండా పరుగెత్తి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది చూసిన కన్నన్‌ అనే శిక్షకుడు మెరుగైన శిక్షణ అందించాడు. పొయ్యి వూదుకొనే ఆడాళ్లకు చదువే ఎక్కువ. మళ్లీ ఆటలు కూడానా? అన్న హేళనలు రేవతిలో పట్టుదలను పెంచాయి... అద్భుతాలు చేయించాయి. అవ్వ, శిక్షకులు అందించిన ప్రోత్సాహం జాతీయ, ప్రపంచ స్థాయి పోటీల్లో పరుగెత్తి చరిత్ర సృష్టించేలా చేశాయి. ఈ క్రమంలో వెన్నెముకకు గాయం తగిలినా... ఆ బాధ నుంచి కోలుకుని కొద్ది రోజుల్లోనే ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లో పాల్గొంది రేవతి. ఈమె ప్రస్తుతం దక్షిణ మధ్యరైల్వే మధురై డివిజన్‌లో కమర్షియల్‌ క్లర్క్‌ కమ్‌ టీసీ. టోక్యో ఒలింపిక్స్‌కు భారత్‌ తరపున క్రీడాకారులను ఎంపిక చేసేందుకు పాటియాలాలో అర్హత పోటీలు నిర్వహించారు. ఇందులో మిశ్రమ రిలే పరుగులో 400 మీటర్ల లక్ష్యాన్ని 53.55సెకన్లలో చేరుకుని రేవతి వీరమణి రికార్డు సృష్టించింది.

తాతయ్య ప్రోత్సాహంతో....

శుభా వెంకటేశన్

తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్‌ అనే కుగ్రామం శుభా వెంకటేశన్‌ది. తండ్రి భవన నిర్మాణ కూలీ. చిన్నతనంలోనే ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు వాళ్ల తాతయ్య సంగిలిముత్తు. పాఠశాలలో పీˆఈటీ ఉపాధ్యాయుడు సెల్వరాజ్‌ కఠోర శిక్షణ ఇచ్చాడు. కానీ తన విజయాలను చూడకుండానే తాతయ్య చనిపోయాడు. అప్పటి నుంచి శుభకు వాళ్ల అమ్మ పూంగొడి అండగా నిలిచింది. 2012లో చెన్నైలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో స్థానం సాధించిన శుభ ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. 21 ఏళ్ల శుభ జాతీయ స్థాయిలో 20, అంతర్జాతీయ స్థాయిలో మూడు పతకాలను సాధించింది. ఆటల కోసం ఆడపిల్లను హాస్టల్లో ఉంచాలా అన్న బంధువులు, చుట్టు పక్కల వారి విమర్శలను పట్టించుకోకుండా నా కుటుంబం అండగా నిలవడం వల్లే ఇదంతా సాధించగలుగుతున్నా అని సంతోషంగా చెబుతోంది శుభ.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.