ETV Bharat / sports

మిలింద్ విజృంభణ.. అగ్రస్థానంతో నాకౌట్​కు హైదరాబాద్

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ(syed mushtaq ali trophy 2021)లో హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తన చివరి లీగ్ మ్యాచ్​లో ఉత్తరప్రదేశ్​పై 29 పరుగుల తేడాతో నెగ్గి గ్రూప్-ఇలో అగ్రస్థానంతో నాకౌట్​కు చేరుకుంది.

Hyderabad
హైదరాబాద్
author img

By

Published : Nov 10, 2021, 8:03 AM IST

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ(syed mushtaq ali trophy 2021) టీ20 క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ వరుసగా ఐదో విజయం సాధించింది. ఎడమచేతి వాటం పేసర్‌ సీవీ మిలింద్‌ (5/8) విజృంభించడం వల్ల చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 29 పరుగుల తేడాతో ఉత్తర్‌ప్రదేశ్‌(hyderabad vs uttar pradesh live)పై నెగ్గింది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో గెలిచిన హైదరాబాద్‌ 20 పాయింట్లతో గ్రూపు-ఇలో అగ్రస్థానం కైవసం చేసుకుని నాకౌట్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన హైదరాబాద్‌ 7 వికెట్లకు 147 పరుగులు సాధించింది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (62; 46 బంతుల్లో 7×4, 1×6) మరో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌ 19.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. 3.2 ఓవర్లు వేసిన మిలింద్‌ కేవలం 8 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

tanmay
తన్మయ్ అగర్వాల్

హైదరాబాద్ ఆటగాళ్లే టాప్

లీగ్‌ దశ ముగిసేసరికి ముస్తాక్‌ అలీ టోర్నీ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో హైదరాబాద్‌ ఆటగాళ్లే అగ్రస్థానాల్లో ఉండటం విశేషం. బ్యాటింగ్‌లో తన్మయ్‌ అగర్వాల్‌ (302 పరుగులు), బౌలింగ్‌లో మిలింద్‌ (16 వికెట్లు) నంబర్‌వన్‌గా కొనసాగుతున్నారు.

ఆంధ్రకు మరో ఓటమి

ఈ టోర్నీలో ఆంధ్రకు మరో ఓటమి ఎదురైంది. మంగళవారం గ్రూపు-సి మ్యాచ్‌లో హిమాచల్‌ప్రదేశ్‌ 30 పరుగుల తేడాతో ఆంధ్రపై గెలిచింది. గ్రూపు దశలో 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర 2 విజయాలు, 3 ఓటములతో 8 పాయింట్లు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

ఇవీ చూడండి: 'టీమ్​ఇండియా అందుకే భారీ స్కోర్లు చేయట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.