ETV Bharat / sports

వైరల్​.. కేఎల్‌ యాక్షన్‌-అతియా రియాక్షన్‌

author img

By

Published : May 26, 2021, 3:43 PM IST

గాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న టీమ్​ఇండియా క్రికెటర్​ కేఎల్​ రాహుల్ కోలుకుంటూ ఇంగ్లాండ్ పర్యటన కోసం సిద్ధమవుతున్నాడు​. ఈ క్రమంలో అతడు తేలికపాటి కసరత్తులు చేస్తున్న ఫొటోలను పంచుకోగా భారీ స్పందన వచ్చింది. అయితే రూమర్​ గర్ల్​ ఫ్రెండ్​ చేసిన కామెంట్​ మాత్రం వైరల్​గా మారింది. ఇంతకీ ఆమె ఏం పెట్టిందంటే?

KL Rahul
కేఎల్‌ యాక్షన్‌

టీమ్‌ఇండియా స్ట్రోక్‌ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ వేగంగా కోలుకుంటున్నాడు. తేలికపాటి కసరత్తులు చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు చిత్రాలను అతడు ఇన్‌స్టాలో పంచుకున్నాడు. వెంటనే అభిమానులంతా లైకుల వర్షం కురిపించారు. అంతేకాదు రాహుల్‌కు ఇష్టమైన స్నేహితురాలు అతియా శెట్టి సైతం ఓ వ్యాఖ్య పెట్టింది. దాంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది.

కెటిల్‌ బాల్‌తో తేలికపాటి కసరత్తులు చేస్తున్న చిత్రాన్ని రాహుల్‌ పోస్ట్‌ చేశాడు. దాంతో పాటు సేదతీరుతున్న, క్యాండిడ్‌ చిత్రాలను పెట్టాడు. ఎంతో మంది అతడి పోస్ట్‌కు స్పందించినప్పటికీ అతియా శెట్టి పెట్టిన కామెంట్‌ మాత్రం వైరల్‌గా మారింది. ఆమె మరీ భిన్నంగా ఏం పెట్టలేదు. కేవలం స్మైలీనే పెట్టింది. వీరిద్దరూ చాలాకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. బహుశా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న ఊహాగానాలు ఉన్నాయి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌ ఆడుతుండగా కేఎల్‌ రాహుల్​కు అపెండిసైటిస్‌ రావడం వల్ల శస్త్రచికిత్స జరిగింది. దీంతో లీగ్‌కు దూరమయ్యాడు. ఇంతలోనే ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్టర్లు టీమ్‌ఇండియాకు ఎంపిక చేశారు. కోలుకుంటేనే రాహుల్‌ ఇంగ్లాండ్‌కు వెళ్తాడని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టే రాహుల్‌ వేగంగా శక్తిని పుంజుకుంటున్నాడు.

ఇదీ చూడండి: 'బుమ్రా బౌలింగ్​ టెక్నిక్​ అతడికే ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.