ETV Bharat / sports

డికాక్ హాఫ్ సెంచరీ.. కోల్​కతా లక్ష్యం 156

author img

By

Published : Sep 23, 2021, 9:28 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్​మెన్ పర్వాలేదనిపించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది ముంబయి.

rohit
రోహిత్

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ పర్వాలేదనిపించింది. డికాక్ (55), రోహిత్ (33) రాణించడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది.

శుభారంభం దక్కినా..

ఓపెనర్లు రోహిత్ శర్మ (33), డికాక్ (55) జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి బంతికే ఫోర్​తో ఇన్నింగ్స్​ను ఆరంభించిన హిట్​మ్యాన్​ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. మొదట నెమ్మదిగా ఆడిన డికాక్​ తర్వాత రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్​ప్లే ముగిసే సరికి 56 పరుగులు చేసింది ముంబయి. అనంతరం 10వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి నరైన్ బౌలింగ్​లో ఔటయ్యాడు రోహిత్ (33). కాసేపటికే సూర్యకుమార్ (5) కూడా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే సమయోచితంగా ఆడిన డికాక్​ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మరో ఐదు పరుగులు జోడించిన ఇతడు 55 పరుగులు చేసి ప్రసిధ్ కృష్ణ బౌలింగ్​లో ఔటయ్యాడు.

అనంతరం ఇషాన్ కిషన్ (14) భారీ షాట్​కు ప్రయత్నించి ఫెర్గుసన్ బౌలింగ్​లో క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. చివర్లో కోల్​కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో పరుగులు రాబట్టడానికి కష్టపడ్డారు పొలార్డ్ (21), కృనాల్ (12) పాండ్యా. 6వ వికెట్​కు 30 పరగులు జోడించిన వీరిద్దరూ ఫెర్గుసన్ వేసిన చివరి ఓవర్లో వరుస బంతుల్లో ఔటయ్యారు. చివరి బంతికి సౌరభ్ తివారి ఫోర్ బాదడం వల్ల ముంబయి ఇన్నింగ్స్​ 155 పరుగుల వద్ద ముగిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.