ఐపీఎల్లో(IPL 2021 News) సోమవారం మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత సీజన్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్(CSK Vs DC) మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
తుదిజట్లు:
దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రిపల్ పటేల్, అక్షర్ పటేల్, షిమ్రోన్ హెట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, ఆవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజిల్‌వుడ్.
ఇదీ చూడండి.. ఇద్దరి ఫుడ్ పంత్ ఒక్కడే తింటాడు: దిల్లీ ఆటగాళ్లు