ETV Bharat / sports

హైదరాబాద్​ వర్సెస్ బెంగళూరు: 'ఈ సాలా' అయినా??

author img

By

Published : Sep 21, 2020, 5:35 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

కప్పుపై దృష్టిసారించిన హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య నేడు మ్యాచ్​ జరగనుంది. దుబాయ్ వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

హైదరాబాద్​ వర్సెస్ బెంగళూరు:  'ఈ సాలా' అయినా??
కోహ్లీ వార్నర్

'ఈ సాలా కప్ నమదే'... సోషల్ మీడియాలో ఈ నినాదంతో ఏటా వారి ఐపీఎల్ ప్రస్థానం మొదలవడం పరిపాటి. లీగ్ దశ చివరకు వచ్చేసరికి మాత్రం వారి లెక్కలే వేరుగా ఉంటాయి. 'చెన్నై ముంబయిని ఓడించి, పంజాబ్ హైదరాబాద్​ను ఓడించి, మనం కేకేఆర్​పై భారీ తేడాతో గెలిస్తే ప్లే-ఆఫ్​కు సులభంగా చేరిపోతాం' ఈ విధంగా వ్యూహాలను సవరించుకోవడమూ ఆనవాయితీయే.

ఈ పాటికే ఆ జట్టు ఏంటో అర్థమైపోయి ఉంటుంది. నేటి(సెప్టెంబరు 21) నుంచి ఆ జట్టు తన ఐపీఏల్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది. అది తలపడబోయే జట్టు మాత్రం అందుకు భిన్నం. ఏమాత్రం హడావిడి ఉండదు. కూల్​గా ఉంటారు. సైలెంట్ కిల్లర్స్​గా పని పూర్తిచేస్తారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో తిరుగేలేదు. ఈ సీజన్ మూడో మ్యాచ్ ద్వారా తమ టైటిల్ వేటను షురూ చేస్తున్నాయి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , సన్​రైజర్స్ హైదరాబాద్.

ఐపీఎల్​లో ముంబయి-చెన్నై పోరు... భారత్-పాక్ అంత అంచనాలు పెంచేది అయితే.. ఆర్సీబీ-హైదరాబాద్​ మ్యాచ్​ను యాషెస్​తో పోల్చినా అతిశయోక్తి కాదేమో. జట్ల వ్యక్తిగత రికార్డులు ఎలా ఉన్నప్పటికీ, ఒకటితో ఒకటి తలపడితే మాత్రం నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయం. గత రికార్డులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. 2013లో హైదరాబాద్​ జట్టు ఏర్పడిన దగ్గర నుంచి ఆర్సీబీతో 15 మ్యాచ్​లు ఆడితే... హైదరాబాద్ 8, బెంగళూరు 6 కైవసం చేసుకుంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2016 ఫైనల్​లో తలపడినప్పుడు సన్​రైజర్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది.

ఆ ఫైనల్ ను, 2017లో రద్దయిన ఒక్క మ్యాచ్ మినహాయిస్తే.. 2013, 14, 15, 16, 18, 19 లీగ్ దశలో ఉండే రెండు మ్యాచ్ లను చెరొకటి గెలుచుకున్నాయి. అంటే ఎప్పటి ప్రతీకారం అప్పుడే తీర్చేసుకుంటున్నాయన్నమాట. ఆ ప్రకారం చూస్తే నేటి పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.

ఆర్సీబీ బలాబలాలేంటి?

కాస్తో కూస్తో క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ఎవర్ని అడిగినా ఆర్సీబీ బలం అంటే కోహ్లీ, డివిలియర్స్ అనే చెప్తారు. దానికి కొనసాగింపుగా ఆ ఇద్దరే వాళ్ల బలహీనత అని కూడా చెప్తారు. అది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పటికి 12 సీజన్లు జరిగితే కేవలం ఐదుసార్లే తుది నాలుగులో నిలిచింది.

ఆర్సీబీ మొదట్నుంచీ బ్యాటింగ్ ప్రధాన జట్టే. లీగ్​లో అత్యధిక స్కోరు చేసిన జట్టు ఇదే. వ్యక్తిగత శతకాలు సైతం ఆ జట్టు తరఫునే ఎక్కువ(13). 2011 నుంచి 2017 వరకూ గేల్+కోహ్లీ+డివిలియర్స్= ఆర్సీబీ అన్నట్టు ఆ జట్టు ప్రయాణం సాగింది. వేలం సమయంలోనూ వీళ్ల చుట్టూనే బ్యాటింగ్ ఆర్డర్​ను బలపర్చుకున్నారే తప్ప... బౌలింగ్ దళాన్ని మెరుగుపర్చుకోవడంలో ఎప్పుడూ అంచనా తప్పుతూ వచ్చారు.

RCB PRACTISE
ప్రాక్టీసులో బెంగళూరు జట్టు

దురదృష్టమో ఏంటో కానీ, వేరే జట్టులో ఆడి ఇక్కడికి వచ్చి బాగా రాణించిన ఆటగాళ్లు తక్కువే. అదే సమయంలో ఆర్సీబీ నుంచి ఇతర జట్లకు వెళ్లి అదరగొట్టినవారు ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటి కొన్ని అనుకోని దురదృష్టాల వల్ల చోకర్స్ అన్న అక్కర్లేని బిరుదును మూటగట్టుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం జట్టులో కీలకంగా ఉన్న చాహల్ మినహా గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా నిలకడగా రాణించిన బౌలర్ కనపడట్లేదు. ఉమేశ్ యాదవ్ గత రెండు సీజన్లుగా పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సీజన్​లో బ్యాటింగ్​లో కోహ్లీ, ఏబీడీ ప్రధానం కానుండగా... ఆసీస్ సారథి ఫించ్, యువ కెరటం దేవ్ దత్ పడిక్కల్, ఆల్ రౌండర్లు మొయిన్ అలీ, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్​తో లైనప్ ఎప్పటిలానే పటిష్ఠంగా కనిపిస్తోంది. అవసరమైతే డివిలియర్స్ కీపింగ్ కూడా చేస్తాడని టీమ్ మేనేజ్​మెంట్ చెప్పడం వల్ల కొన్ని మ్యాచ్ ల వరకూ పార్థివ్ బెంచ్ కే పరిమితమవచ్చు. ఫించ్ అంచనాలు అందుకోలేకపోతే, కొన్ని మ్యాచ్​ల తర్వాత యువ ఆస్ట్రేలియన్ బ్యాట్సమన్ ఫిలిప్పీకి అవకాశం దక్కచ్చు.

బౌలింగ్ విభాగంలో చాహల్ ఉండనే ఉన్నాడు. అధిక ధరకు కొనుగోలు చేసిన మోరిస్​తో పాటు, సీనియర్ పేసర్ స్టెయిన్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ నిలకడ తెచ్చుకోవాలని బెంగళూరు కోరుకుంటోంది. కొన్నాళ్లుగా గాయాలతో సతమతమైన స్టెయిన్ గన్ మళ్లీ మునపటిలా పేలుతుందో లేదో అనుమానమే. ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ ఆడం జంపా ఉన్నప్పటికీ... చాహల్ ఉండగా తుది జట్టులో మరొక లెగ్గీని ఆడిచకపోవచ్చు.

హైదరాబాద్ బలాబలాలు

గత కొన్నేళ్లలో సన్​రైజర్స్ అంత వేగంగా ఎదిగిన జట్టు మరొకటి లేదేమో. 2013 నుంచి ఆడుతుండగా.. 2014,15 మినహా ప్రతిసారి ప్లే-ఆఫ్స్ కు చేరింది. గత నాలుగేళ్లు తుది నాలుగుకు క్రమం తప్పకుండా చేరింది. 2016లో ఛాంపియన్​గా, 2018లో రన్నరప్​గా నిలిచింది. టామ్ మూడీ, లక్ష్మణ్, మురళీధరన్ మార్గనిర్దేశంలో ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా మారింది. ఈ ఏడాది మూడీ లేకపోయినా ట్రెవర్ బేలిస్ రూపంలో మరో అద్భుతమైన కోచ్ దొరికాడు.

‌2013 సీజన్ నుంచి ధావన్, డారెన్ సామి వంటి అనేక మంది కెప్టెన్లను ప్రయత్నించినా ఎందుకో ఎక్కడో ఎదో తేడా కనిపించేది. కానీ ఎప్పుడైతే వార్నర్ పగ్గాలు చేపట్టాడో అప్పట్నుంచి జట్టు దృక్పథమే మారిపోయింది. స్వతహాగా కడదాకా పోరాడే లక్షణం ఇన్న అతను... దాన్ని జట్టులోనూ నూరిపోసాడు. జట్టు నుంచి నడిపించడంలోనూ వార్నర్ దిట్ట. 2015,17,19 లో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. ఈసారీ అతనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రపంచంలో కెప్టెన్ కూల్ ధోనీ కన్నా కూలెస్ట్ ఎవరైనా ఉన్నారంటే నిస్సందేహంగా కేన్ విలియమ్సన్ పేరు చెప్పొచ్చు. బాల్ టాంపరింగ్ వివాదంతో వార్నర్ దూరమైనప్పుడు సారథి బాధ్యతలు స్వీకరించి జట్టును ఫైనల్​కు తీసుకెళ్లాడు. ఆరెంజ్ క్యాప్ కూడా సాధించాడు. గతేడాది వార్నర్ తిరిగొచ్చినా కెప్టెన్​గా ఉన్న కేన్... జట్టు సమతూకం కోసం తనను తాను పక్కన పెట్టుకున్నాడు. వార్నర్ సారథ్యంలో ఈసారి కూడా కొన్నిసార్లు ఆ పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వార్నర్, కేన్​తో పాటు బెయిర్ స్టో, మనీశ్ పాండేతో లైనప్ బలంగా ఉంది.

SunRisers Hyderabad
ప్రాక్టీసులో సన్​రైజర్స్ హైదరాబాద్

యువకులకు అవకాశాలివ్వడంలో ముందుండే హైదరాబాద్... విరాట్ సింగ్, ప్రియం గార్గ్, అబ్దుల్ సమద్, తెలుగు తేజం సందీప్ బవనక రూపంలో పలు ఆసక్తికర టాలెంట్స్​ను అందుబాటులో ఉంచుకుంది.

మిడిల్, లోయర్ ఆర్డర్ బాధ్యతలతో పాటు స్పిన్ భారాన్ని కూడా మోస్తున్న ఆఫ్ఘన్ ద్వయం నబీ, రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నబీ ప్రపంచ నంబర్ వన్ ఆల్ రౌండర్ అయితే, బౌలర్లలో రషీద్ ది అగ్రస్థానం. వీరికి తోడుగా అభిషేక్ శర్మ, మిచెల్ మార్ష్, ఫేబియాన్ అల్లెన్ ఉన్నారు.

ఉత్తమ భారతీయ బౌలింగ్ దళం ఉన్న జట్టు హైదరాబాద్ అనే చెప్పొచ్చు. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ దీన్ని ముందుండి నడిపిస్తున్నాడు. అతనికి తోడుగా సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, థంపి, సందీప్ శర్మ, నటరాజన్ ఉన్నారు. బిల్లీ స్టాన్ లేక్ మాత్రమే ఏకైక విదేశీ పేసర్. వివిధ రకాల బౌలర్లు ఉన్నారు కాబట్టే ఎంత చిన్న స్కోరునైనా కాపాడుకునే జట్టుగా హైదరాబాద్ అవతరించింది.

జట్లు(అంచనా)

సన్​రైజర్స్ హైదరాబాద్

వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, విజయ్ శంకర్, విరాట్ సింగ్, అబ్దుల్ సమద్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

దేవ్ దత్ పడిక్కల్/పార్థివ్, ఫించ్, కోహ్లీ, డివిలియర్స్, మొయిన్ అలీ, శివం దుబే/పవన్ నెగి, మోరిస్, సుందర్, ఉమేశ్ యాదవ్, సైనీ, చాహల్

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.