బెంగళూరు - రాజస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో ఎడతెరిపకుండా వాన పడుతూనే ఉంది. దాదాపు గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశముంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్ జట్టు.
ఏటా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌కు అయినా.. బెంగళూరు జట్టుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టాలనుకుంటోంది ఆర్సీబీ. ప్లే ఆఫ్‌కు వెళ్లాలని ఆశిస్తుంది రాజస్థాన్.