ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మొదటి క్వాలిఫైర్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. చెపాక్ వేదికగా తలపడుతున్న ఈ మ్యాచ్‌లో ధోనీ (37, 29 బంతుల్లో), రాయుడు (42, 37 బంతుల్లో) ఆకట్టుకున్నారు. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. రాహుల్ చాహర్ 2 వికెట్లు తీయగా.. కృణాల్, జయంత్ యాదవ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
-
Rahul Chahar is our key performer in the first innings for his brilliant bowling figures of 2/14 👏👏#Qualifier1 #MIvCSK pic.twitter.com/jPMCDJEp6i
— IndianPremierLeague (@IPL) May 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rahul Chahar is our key performer in the first innings for his brilliant bowling figures of 2/14 👏👏#Qualifier1 #MIvCSK pic.twitter.com/jPMCDJEp6i
— IndianPremierLeague (@IPL) May 7, 2019Rahul Chahar is our key performer in the first innings for his brilliant bowling figures of 2/14 👏👏#Qualifier1 #MIvCSK pic.twitter.com/jPMCDJEp6i
— IndianPremierLeague (@IPL) May 7, 2019
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేనకు శుభారంభం దక్కలేదు. 6 పరగుల వద్దే డూప్లిసిస్ (6) వికెట్ కోల్పోగా.. అనంతరం కొద్దిసేపటికే రైనాను (5) జయంత్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. మరికొద్దిసేపటికే వాట్సన్ (10) కూడా వెనుదిరిగాడు. పవర్ ప్లేలో కేవలం 32 పరుగులే చేసింది చెన్నై. అనంతరం మురళి విజయ్ (26) నిలకడగా ఆడుతూ వికెట్ల పతనాన్ని కాసేపు ఆపాడు.
-
Caption this? 🤔🤔#Qualifier1 #MIvCSK pic.twitter.com/DIYPXZLbke
— IndianPremierLeague (@IPL) May 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Caption this? 🤔🤔#Qualifier1 #MIvCSK pic.twitter.com/DIYPXZLbke
— IndianPremierLeague (@IPL) May 7, 2019Caption this? 🤔🤔#Qualifier1 #MIvCSK pic.twitter.com/DIYPXZLbke
— IndianPremierLeague (@IPL) May 7, 2019
విజయ్ను రాహుల్ చాహర్ ఔట్ చేయగా.. తర్వాత వచ్చిన ధోనీ - రాయుడు జోడి స్కోరు వేగాన్ని పెంచారు. జయంత్ యాదవ్ బౌలింగ్‌లో చెరో సిక్సర్ కొట్టి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. మలింగ వేసిన 18వ ఓవర్లో ధోనీ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి 15 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్ వేసిన బుమ్రా.. తొలి బంతికే మహీని ఔట్ చేయగా.. అది నోబాల్‌గా తేలింది. ఈ ఓవర్లో చెన్నై 9 పరుగులు మాత్రమే చేసింది.
ముంబయి బౌలర్లలో రాహుల్ చాహర్ డూప్లిసిస్, మురళీ విజయ్ను ఔట్ చేసి చెన్నై సూపర్ కింగ్స్‌ను దెబ్బతీశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సురేశ్ రైనాను జయంత్ యాదవ్ ఔట్ చేయగా.. వాట్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు కృణాల్ పాండ్య.