ETV Bharat / sports

'గట్టిగా పోరాడం.. అత్యుత్తమంగా ఆడాం కానీ..'

టెస్టు​ సిరీస్​లో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేసిందని ఆసీస్​ ఓపెనర్​​ వార్నర్​ ప్రశంసించాడు. అత్యుత్తమంగా ఆడినా సరే ప్రత్యర్థి ప్రదర్శన ముందు తేలిపోయామని అన్నాడు. ఈ సిరీస్​ను 2-1 తేడాతో భారత్​ సొంతం చేసుకుంది.

We were outplayed by India: Warner
మా జట్టు సరిగా ఆడలేదు: వార్నర్​
author img

By

Published : Jan 20, 2021, 6:35 PM IST

టీమ్​ఇండియాపై టెస్టు​ సిరీస్​ ఓడిపోవడంపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్​ వార్నర్ అంగీకరించాడు. భారత జట్టు చేతిలో తేలిపోయామని అన్నాడు. అద్భుత ప్రదర్శన చేసిన ప్రత్యర్థి జట్టను అభినందించాడు. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికీ.. నిర్ణయాత్మక మ్యాచ్​లో అసాధారణంగా ఆడారని వార్నర్​ ప్రశంసించాడు. అడిలైడ్​లో టెస్టులో అత్యల్ప స్కోరు 36 నమోదు చేసినా సరే గొప్పగా పుంజుకున్నారని మెచ్చుకున్నాడు.

"గెలవాల్సిన చోట ఓడిపోయాం. ఫలితం పట్ల అసంతృప్తిగా ఉన్నాం. సిరీస్​ ఆసాంతం ​టీమ్​ఇండియా ఉత్తమ ప్రదర్శన చేసింది. గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశాం. మా స్థాయికి తగ్గట్లు ఆడాం. కానీ, మేం ఓడిపోయాం. మ్యాన్​ ఆఫ్​ ద సిరీస్ అందుకున్న కమిన్స్​ అద్భుతంగా బౌలింగ్ చేశాడు"

-డేవిడ్​ వార్నర్, ఆస్ట్రేలియా ఓపెనర్​

సిరీస్​ విజయంతో భారత్.. టెస్టు ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుందని వార్నర్​ చెప్పాడు. రేసులో నిలిచేందుకు దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్​పై దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఆసీస్ జట్టులో భారీ మార్పులు జరగొచ్చు: వార్న్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.