ETV Bharat / sports

IND Vs SA: టాస్ గెలిచిన టీమ్ఇండియా.. కోహ్లీ లేకుండానే బరిలోకి

IND vs SA Test: మరికాసేపట్లో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా ఈ మ్యాచ్​లో ముందుగా టాస్​ గెలిచిన టీమ్​ఇండియా బ్యాటింగ్​ ఎంచుకుంది. గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు.

teamindia vs southafrica
టీమ్​ఇండియా వర్సెస్​ దక్షిణాఫ్రికా
author img

By

Published : Jan 3, 2022, 1:05 PM IST

Updated : Jan 3, 2022, 1:23 PM IST

IND vs SA Test: భారత్, దక్షిణాఫ్రికా జట్లు మరికాసేపట్లో రెండో టెస్టులో తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దూరం కాగా, కేఎల్‌ రాహుల్‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన అతడు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కోహ్లీ స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చాడు. కాగా ఇప్పటికే టీమ్‌ఇండియా తొలి టెస్టులో విజయం సాధించడం వల్ల ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది.. తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇక సఫారీ జట్టు తొలి టెస్టుకు ప్రతీకారం తీర్చుకొని ఈ మ్యాచ్‌లో గెలవాలని భావిస్తోంది. దీంతో రెండో టెస్టు రసవత్తరంగా మారింది.

జట్లు

భారత్

కేఎల్ రాహుల్(కెప్టెన్​), మయాంక్ అగర్వాల్, పుజారా, రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, బుమ్రా, మహ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికా

డీన్ ఎల్గర్, మర్క్‌రమ్, కీగన్​ పీటర్సెన్​, రాస్సీ వాండర్ డస్సేన్, టెంబా బవుమా, కైల్ వెర్రియాన్నే, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎంగిడి

ఇదీ చూడండి: అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ, రహానె

Last Updated : Jan 3, 2022, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.