ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్: బీసీసీఐకి ఐసీసీ డెడ్​లైన్​!

టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకి నెల రోజుల సమయాన్నిచ్చింది ఐసీసీ. అప్పటి వరకు టోర్నీ ఆతిథ్యంపై స్పష్టత ఇవ్వాలని సూచించింది.

icc, bcci
ఐసీసీ, బీసీసీఐ
author img

By

Published : Jun 1, 2021, 9:07 PM IST

టీ20 ప్రపంచకప్​ ఆతిథ్యంపై నిర్ణయం తీసుకునేందుకు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి.. జూన్​ 28 వరకు సమయాన్నిచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ముందు నుంచి భారత్​ భావిస్తున్నట్లుగానే ఐసీసీ దాదాపు నెల రోజులనిచ్చింది.

ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​లో భారత్​ వేదికగా పొట్టి ప్రపంచకప్​ జరగాల్సి ఉంది. కొవిడ్ వల్ల ఇప్పటికే ఐపీఎల్​ నిరవధిక వాయిదా పడింది. దీంతో టీ20 వరల్డ్​కప్​ నిర్వహణ సందిగ్ధంలో పడింది. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఐసీసీతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా వర్చువల్​గా సమావేశమయ్యారు.

"అవును, బీసీసీఐ కోరినట్లుగా టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి ఐసీసీ నెల రోజుల సమయాన్నిచ్చింది. అప్పటి వరకు పొట్టి ప్రపంచకప్​పై ఆతిథ్యమిచ్చే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బోర్డుకు అవకాశముంది. తదుపరి వారు మరోసారి భేటీ కానున్నారు."

-ఐసీసీ సన్నిహిత వర్గాలు.

భారత్​లో కొవిడ్ మూడో వేవ్​ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒకవేళ టోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోతే.. ప్రపంచకప్​ను యూఏఈకి తరలిస్తారు. ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐకే ఉంటాయి.

ఇదీ చదవండి: 'రోహిత్​ తొలి 50.. నా బ్యాట్​తోనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.