Women T20 Challenge: టీ20 ఛాలెంజ్ టైటిల్ హర్మన్ ప్రీత్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో దీప్తి శర్మ జట్టును నాలుగు పరుగులు తేడాతో ఓడించి హర్మన్ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దీప్తి శర్మ జట్టు 161/8 స్కోరుకే పరిమితమైంది. లారా వాల్వార్డ్ (65), సిమ్రన్ బహుదుర్ (20) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 15, యస్తిక భాటియా 13, కిరన్ నవ్‌గిరే డకౌట్, నాథకన్ ఛతామ్ 6, దీప్తి శర్మ 2, స్నేహ్ రాణా 15, కేట్ క్రాస్ 13 పరుగులు చేశారు. హర్మన్ టీమ్ బౌలర్లలో అలానా కింగ్ 3, సోఫీ 2, డాటిన్ 2, పూజ వస్త్రాకర్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో హర్మన్ జట్టు మూడో సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు 2018, 2019 సంవత్సరాల్లోనూ టైటిల్‌ను గెలుచుకుంది.
ధాటిగా ఆరంభం.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ జట్టుకు అద్భుత ఆరంభం దక్కింది. ఓపెనర్లు డాటిన్ (62), ప్రియా పునియా (28) తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన హర్మన్ ప్రీత్ (43) కూడా ధాటిగా ఆడింది. అయితే మిగతా బ్యాటర్లు పూజా వస్త్రాకర్ (5), ఎక్లేస్టోన్ (2), సునె లూయిస్ (3), డియోల్ (7) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో పరుగుల వేగం మందగించింది. దీప్తి శర్మ బౌలర్లలో కేట్ క్రాస్ 2, దీప్తి శర్మ 2, సిమ్రన్ 2, ఖాకా ఒక వికెట్ తీశారు. .
ఇవీ చదవండి: అయ్యో.. కెప్టెన్ మారినా తలరాత మారలేదే.. కారణమిదేనా?