2021-22 దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసింది. సెప్టెంబర్ నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో ఈ సీజన్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ తర్వాత డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు రంజీ ట్రోఫీ నిర్వహించాలని చూస్తోంది. గతేడాది కరోనా వైరస్ కారణంగా దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ముఖ్యమైన రంజీ ట్రోఫీని నిర్వహించలేదు. 87 ఏళ్లలో తొలిసారి ఇలా జరిగింది. దానికి బదులు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20, విజయ్ హజారే వన్డే ట్రోఫీలను నిర్వహించింది. అయితే ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
అలాగే ఈ సీజన్‌లో దులీప్ ట్రోఫీ, దియోధర్ ట్రోఫీ, ఇరానీ కప్ టోర్నీలకు అవకాశం ఇవ్వలేదు. అలాగే ఐదు మహిళల ఈవెంట్లను కూడా రద్దు చేసిందని సమాచారం. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రమైన నేపథ్యంలోనూ బీసీసీఐ అన్ని వయసుల వారికి మ్యాచ్‌లు నిర్వహించాలని చూస్తోంది. గతేడాది మహిళల క్రికెట్‌కు విరామం ఇచ్చిన నేపథ్యంలో, ఈసారి వారికి కూడా పలు టోర్నీలు నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్, అక్టోబర్ మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, నవంబర్‌లో విజయ్ హజారే ట్రోఫీ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక డిసెంబర్ నుంచి మార్చి వరకు రంజీ ట్రోఫీ కొనసాగించాలని భావిస్తోంది.
- సీనియర్ పురుషుల విభాగం
సయ్యద్ ముస్తాక్ అలీ (టీ20) - సెప్టెంబర్ అక్టోబర్ మధ్య
విజయ్ హజారే ట్రోఫీ (వన్డే) - నవంబర్
రంజీ ట్రోఫీ (ఫస్ట్‌క్లాస్) - డిసెంబర్21 - మార్చి22
- అండర్-23 పురుషుల విభాగం
నేషనల్ అండర్-23 వన్డే మ్యాచ్‌లు - అక్టోబర్ - నవంబర్ మధ్య
సీకే నాయుడు ట్రోఫీ - డిసెంబర్21 - మార్చి22
- అండర్-19 బాయ్స్
వినో మన్కడ్ (వన్డే) - అక్టోబర్
అండర్-19 వన్డే ఛాలెంజర్ - నవంబర్
కూచ్ బిహార్ ట్రోఫీ - నవంబర్ 21 - జనవరి22
- అండర్-16 బాయ్స్
విజయ్ మర్చంట్ ట్రోఫీ - అక్టోబర్ - డిసెంబర్
- సీనియర్ మహిళల విభాగం
సీనియర్ మహిళల టీ20 లీగ్ - అక్టోబర్
సీనియర్ మహిళల వన్డే లీగ్ - నవంబర్
- అండర్-23 మహిళల విభాగం
మహిళల అండర్-23 టీ20 లీగ్ - డిసెంబర్
మహిళల అండర్-23 వన్డే లీగ్ - జనవరి22