టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. ప్రపంచకప్లో భారత జట్టుకు విజయావకాశాలు ఎక్కువని చెప్పాడు. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్లలో మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తే పరుగుల్ని నియంత్రించే అవకాశం ఉంటుందని, తద్వారా విజయాలు సాధించొచ్చని విశ్లేషించాడు.
"ఇంతకు ముందు ఇంగ్లాండ్లో పర్యటించిన నేపథ్యంలో ఈ ప్రపంచకప్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాను. టోర్నీలో జరిగే మ్యాచ్లలో మధ్య ఓవర్లలో వికెట్లు తీసే జట్లకు విజయావకాశాలు ఎక్కువ. టీమిండియా సభ్యులు బుమ్రా, చాహల్, కుల్దీప్ ఈ అవకాశాన్ని వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యర్థి అధిక స్కోరు చేయకుండా ఉండటంలో వీరి పాత్ర ఎంతో కీలకం కానుంది." -రాహుల్ ద్రవిడ్, టీమిండియా మాజీ కెప్టెన్
ప్రపంచకప్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్కు కప్పు గెలిచే అవకాశాలున్నాయని చెప్పాడు ఈ దిగ్గజ క్రికెటర్.
మే 30న ప్రారంభం కానుంది ఈ మెగాటోర్నీ. జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. అంతకు ముందు ఈనెల 25న న్యూజిలాండ్తో, 28న బంగ్లాదేశ్తో ప్రాక్టీసు మ్యాచ్లు ఆడనున్నారు 'మెన్ ఇన్ బ్లూ'.