ETV Bharat / sports

జట్టు సభ్యులకు కోహ్లీ హెచ్చరిక.. అతిక్రమిస్తే అంతే - kohli warns team mates

బయోసెక్యూర్​లో జరిగే ఐపీఎల్​లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జట్టులోని సహచరులకు కెప్టెన్​ కోహ్లీ చెప్పాడు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించాడు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Aug 24, 2020, 10:43 PM IST

ఐపీఎల్​కు ముందు తన జట్టులోని ఆటగాళ్లతో వర్చువల్​గా మాట్లాడాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ. బయో బబుల్​ వాతవరణానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, ప్రతిఒక్కరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశాడు. చిన్న తప్పు జరిగినా ఆ ప్రభావం పూర్తి టోర్నీపై పడుతుందని, ఒకవేళ జరిగితే మాత్రం సహించేది లేదని హెచ్చరించాడు. ఆటగాళ్లందరూ బాధ్యతగా వ్యవహరించేలా చూడడం ఓ సారథిగా తన బాధ్యతని చెప్పాడు.

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్సీబీ డైరెక్టర్​ మైక్​ హెసన్​ చెప్పారు. వారిని ఏడు రోజులు క్వారంటైన్​లో ఉంచి.. తర్వాత వైరస్​ నిర్థరణ పరీక్షల్లో నెగిటివ్​గా తేలితేనే తిరిగి ఆడేందుకు అనుమతిస్తామని అన్నారు.

బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఐపీఎల్​ వేదిక దుబాయ్​ చేరుకున్న మన క్రికెటర్లు, ఆరు రోజుల క్వారంటైన్​లో ఉంటారు. ఇందులో భాగంగా 1,3,6 రోజుల్లో వారికి వైద్య పరీక్షలు చేస్తారు. వీటిలో నెగిటివ్​గా తేలితేనే​ బయో బబుల్​లోకి అనుమతిస్తారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు​ ప్రస్తుత సీజన్​ జరగనుంది.

ఇది చూడండి 13 ఏళ్ల కష్టానికి ప్రతిఫలమే 'అర్జున': ఇషాంత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.