టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచకప్‌లో జరిమానా పడింది. శనివారం అఫ్గానిస్థాన్‌తో పోరులో దురుసు ప్రవర్తన కారణంగా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు.
" ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.1ను కోహ్లీ అతిక్రమించాడు. అందుకే ఈ జరిమానా విధించాం" -ఐసీసీ
అసలేం జరిగింది...
తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 29 ఓవర్ వేస్తున్నాడు. క్రీజులో ఉన్న అఫ్గాన్ బ్యాట్స్‌మన్ రహ్మత్ షా ప్యాడ్‌ను బంతి తాకింది. అంపైర్ అలీందర్ దగ్గరకు వెళ్లి గట్టిగా ఎల్బీడబ్ల్యూను అప్పీల్ చేశాడు విరాట్ కోహ్లీ.
ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 అతిక్రమణ కిందకు వస్తుంది. పర్యవసానంగా మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు కోత విధించొచ్చు. ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు జత చేస్తారు.
2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తన కారణంగా ఇప్పటికే కోహ్లీ ఖాతాలో ఒక పాయింటు ఉంది.
24 నెలల్లో ఎవరైనా ఆటగాడికి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే అతడిపై నిషేధం విధిస్తారు. రెండు పాయింట్లు ఉంటే ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు ట్వీటంటీల్లో ఆడటానికి వీల్లేదు.
ఇది చదవండి: ఆ ఘనత సాధించిన మూడో జట్టు టీమిండియా