ETV Bharat / sports

గావస్కర్​ విమర్శలపై బెయిర్​ స్టో సెటైర్​

తనను విమర్శించిన టీమ్​ఇండియా దిగ్గజం గావస్కర్​పై ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​ బెయిర్​స్టో సెటైర్​ వేశాడు. తన ఫోన్​ ఆన్​లోనే ఉందని, కావాలంటే ఎప్పుడైనా కాల్​ చెయ్యొచ్చని అన్నాడు.

gawaskar
గావస్కర్​
author img

By

Published : Mar 27, 2021, 9:41 PM IST

ఇటీవల టీమ్‌ఇండియాతో ఆడిన చివరి రెండు టెస్టుల్లో పూర్తిగా విఫలమైన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో(124) గతరాత్రి జరిగిన రెండో వన్డేలో శతకంతో కదంతొక్కాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను విజయపథంలో నడిపించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన అతడు.. టెస్టు క్రికెట్‌ సందర్భంగా టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. తన ఫోన్‌ ఆన్‌లోనే ఉందని, టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం కావాలంటే ఫోన్‌ చెయ్యొచ్చని చెప్పాడు.

అహ్మదాబాద్‌ వేదికగా మొతేరా స్టేడియంలో జరిగిన చివరి రెండు టెస్టుల్లో బెయిర్‌స్టో మూడుసార్లు డకౌటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గావస్కర్‌ అప్పుడు అతడి బ్యాటింగ్‌పై విమర్శలు చేశాడు. ఇంగ్లిష్‌ ఓపెనర్‌ క్రీజులో ఉండడానికి ఆసక్తి చూపట్లేదని అన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా శతకం బాదిన బెయిర్‌స్టో ఆ వ్యాఖ్యలపై స్పందించాడు. ‘నిజం చెప్పాలంటే గావస్కర్‌ ఏమన్నాడో నాకు తెలియదు. రెండోది మా మాధ్య ఎలాంటి సంభాషణలు జరగనప్పుడు ఆ విషయంపై ఒక అభిప్రాయం ఎలా ఏర్పడుతుందనే దానిపై నాకు ఆసక్తి ఉంది’ అని పేర్కొన్నాడు.

ఇక గావస్కర్‌ కావాలనుకుంటే తనతో మాట్లాడొచ్చని, తనకు ఫోన్‌ చేయొచ్చని చెప్పాడు. అందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానన్నాడు. ‘టెస్టు క్రికెట్‌లో బాగా ఆడటంపై నాకున్న ఆసక్తి, నేను ఆస్వాదించే తీరును ఆయనతో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నా. నా ఫోన్‌ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. కావాలంటే కాల్‌ చెయ్యొచ్చు లేదా మెసేజ్‌ చేయొచ్చు’ అని బెయిర్‌స్టో చెప్పుకొచ్చాడు. కాగా, రెండో వన్డేలో టీమ్‌ఇండియా నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 43.3 ఓవర్లలోనే ఛేదించింది. నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. భారత జట్టుపై ఇంగ్లాండ్‌కిది అత్యుత్తమ ఛేదన. జేసన్‌ రాయ్‌(55)తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన బెయిర్‌స్టో అద్భుతంగా ఆడాడు. ఆపై బెన్‌స్టోక్స్‌(99)తో కలిసి రెండో వికెట్‌కు 175 పరుగులు జోడించాడు. వీరిద్దరూ సిక్సుల వర్షం కురిపించి మ్యాచ్‌ను భారత్‌కు దూరం చేశారు. ఇక చివరి వన్డే ఆదివారం మధ్యాహ్నాం జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్‌ సొంతం.

ఇదీ చూడండి: 'టెస్టుల్లో బెయిర్​స్టోకు రోజులు దగ్గరపడ్డాయి'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.