ఐపీఎల్ 2021 వేలం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను బెంగుళూరు జట్టు రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో మ్యాక్సీ.. పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. కాగా, గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. ఈ స్టార్ క్రికెటర్ ప్రస్తుతం అత్యధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. చెన్నై, బెంగుళూరు మధ్య వేలం పోటాపోటీగా జరిగింది. గత ఐపీఎల్లో పంజాబ్ ఇతన్ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
మరో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ.2.2 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్లో స్మిత్.. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్: దిల్లీ క్యాపిటల్స్‌కు స్మిత్