ETV Bharat / sports

ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ - smriti

ఈ మ్యాచ్​ గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోగలుగుతుంది టీమిండియా. రెండో టీ 20 గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనుకుంటోంది ఇంగ్లీష్ జట్టు.

మహిళల జట్టు
author img

By

Published : Mar 7, 2019, 10:52 AM IST

భారత్​-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మహిళల రెండో టీ 20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లీష్ జట్టు. అసోం గువహటి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది అమ్మాయిల జట్టు. మూడు టీ 20ల సిరీస్​లో 0-1తేడాతో వెనుకంజలో ఉంది.

ఈ మ్యాచ్​ గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోగలుగుతుంది టీమిండియా. తొలి టీ 20లో బ్యాట్స్​ఉమెన్ విఫలమవగా... 160 పరుగుల లక్ష్య ఛేదనలో 119కే ఆలౌటైంది. ఇటీవల కివీస్​తో జరిగిన టీ 20 సిరీస్​లో ఓడిపోయింది భారత్. గత నాలుగు టీ 20ల్లో పరాజయం పాలయ్యారు అమ్మాయిలు.

భారత కెప్టెన్ హర్మన్​ప్రీత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గాయంతో సిరీస్​కు దూరమైన హర్మన్ స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానాకు సారథ్యం అప్పగించారు. గత మ్యాచ్​లో బ్యాటింగ్​లో విఫలంకాగా.. అనంతరం మిగతా బ్యాట్స్​ఉమెన్​ వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు.

భారత సీనియర్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ 7 పరుగులకే వెనుదిరగగా మిడిల్​ఆర్డ్​ర్​లో ఆదుకునే వాళ్లు కరవయ్యారు. బౌలర్లలో శిఖా పాండే, పూనమ్ యాదవ్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నపటికీ.. ఇంగ్లండ్ పరుగుల ప్రవాహాన్ని ఆపలేకపోయారు.

వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ టీ 20లో సత్తా చాటింది ఇంగ్లండ్​ జట్టు . మూడో వన్డే నుంచే గేరు మార్చి దూసుకెళ్తోంది. ఆల్​రౌండ్ ప్రతిభతో ఈ మ్యాచ్​ గెలిచి సిరీస్ సొంతం చేసుకోగలమని ఆత్మవిశ్వాసంతో ఉంది.

Intro:Body:

a

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.