ETV Bharat / sports

అండర్​19 ప్రపంచకప్​: జపాన్​పై భారత్ జయభేరి

టీమిండియా యువ జట్టు ప్రపంచకప్​లో అదరగొడుతోంది. నేడు జపాన్​తో జరిగిన మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

India
ఇండియా
author img

By

Published : Jan 21, 2020, 4:41 PM IST

Updated : Feb 17, 2020, 9:15 PM IST

అండర్​-19 ప్రపంచకప్​లో టీమిండియా దూసుకెళ్తోంది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్​లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు నేడు జపాన్​తో జరిగిన రెండో మ్యాచ్​లోనూ సత్తాచాటారు. 10 వికెట్ల తేడాతో గెలిచి తమ ఆధిపత్యాన్ని చూపించారు.

మొదట టాస్​ గెలిచిన భారత్ ముందుగా జపాన్​కు బ్యాటింగ్ అప్పగించింది. టీమిండియా బౌలర్లు విజృంభించి పసికూన జట్టును 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌట్ చేశారు. వీరి ధాటికి ఒక్క బ్యాట్స్​మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోవడం విశేషం. అండర్-19 ప్రపంచకప్​లో ఇదే సంయుక్త అత్యల్ప స్కోర్. భారత బౌలర్లలో రవి బిష్నోయ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. 8 ఓవర్లు వేసిన ఈ యువ బౌలర్ 3 మెయిడెన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కార్తీక్ త్యాగీ మూడు, ఆకాశ్ సింగ్ రెండు, విద్యాధర్ పాటిల్ ఒక వికెట్​తో ఆకట్టుకున్నారు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్ 29, కుమార్ కుశగ్ర 13 పరుగులతో నాటౌట్​గా నిలిచారు. ఫలితంగా 4.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 10 వికెట్ల తేడాతో భారత యువ జట్టు జయభేరి మోగించింది. నాలుగు వికెట్లతో సత్తాచాటిన రవి బిష్నోయ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా ఎంపికయ్యాడు. 24న న్యూజిలాండ్​తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది భారత్.

ఇవీ చూడండి.. మ్యాక్స్​వెల్​ను ఎంపిక చేయకపోవడంపై కోహ్లీ ఆశ్చర్యం!

Intro:Body:Conclusion:
Last Updated : Feb 17, 2020, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.