ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గట్టి పోటీనిస్తుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తెలిపింది. మూడేళ్ల కాలంలో జట్టు అనుభవం ఎంతో పెరిగిందని స్పష్టం చేసింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతామని వెల్లడించింది.
"రోజు రోజుకు మా జట్టు మెరుగవుతోంది. అందరి ప్రదర్శన సానుకూలంగా ఉంది. మేం ట్రోఫీ గెలిస్తే చాలా పేరొస్తుంది. ఎంతో మార్పు ఉంటుంది. 2017లో మా ప్రదర్శనకు వచ్చిన స్పందన ఆశ్చర్యపరిచింది. మైదానంలో ఒత్తిడికి లోను కావొద్దని మా తల్లిదండ్రులు చెప్పారు. మేం గెలిస్తే చరిత్రలో నిలిచిపోతాం. అందుకోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం".
- హర్మన్‌ప్రీత్ కౌర్, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్
ఫిబ్రవరి 21న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 2017 ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఆతిథ్య జట్టు చేతిలో 9 పరుగుల తేడాతో ఓడినా అందరి మనసులు గెలుచుకుంది.
ఇదీ చూడండి.. కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన డుప్లెసిస్