ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఇప్పటివరకు ఈ ఘనతను ముగ్గురు క్రికెటర్లు సాధించగా.. నాలుగొవ క్రికెటర్‌గా బ్రాడ్ నిలిచాడు. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా వెస్డిండీస్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో ఈ రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ ఈ ఫార్మాట్లోకి బ్రాడ్ అరంగేట్రం చేసి 14ఏళ్లు అయింది.
తొలి ముగ్గురు ఆటగాళ్లు వీరే
ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌలర్ అండర్సన్ 153 మ్యాచుల్లో 26.83 సగటుతో 589 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ అరంగేట్రం చేసిన 18ఏళ్లకు ఈ ఘనతను అందుకున్నాడీ బౌలర్.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పీడ్‌గన్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా 124 మ్యాచుల్లో 21.64 సగటుతో 563 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన 15ఏళ్లకు ఈ రికార్డు వరించింది.
వెస్టిండీస్ మాజీ ఆటగాడు కోర్ట్నీ వాల్ష్.. ఈ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన 17ఏళ్లకు ఈ ఘనతను అందుకున్నాడు. 132 మ్యాచుల్లో 24.44 సగటుతో 519 వికెట్లు దక్కించుకున్నాడు..
ఇది చూడండి ఐపీఎల్ నిర్వహణపై ఆగస్టు 2న పూర్తి స్పష్టత