దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. సమష్టిగా రాణించిన బంగ్లా ప్రపంచకప్‌ను ఘనంగా ప్రారంభించింది. మొదట బంగ్లా బ్యాట్స్‌మెన్ సత్తాచాటి జట్టుకు 330 పరుగుల భారీ స్కోర్ అందించారు. అనంతరం బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాకు దూరం చేశారు.
331 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టులో డికాక్ (23) పరుగులు చేసి ఔటవగా.. మరో ఓపెనర్ మర్కరమ్ (45) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సారథి డుప్లెసిస్ మిల్లర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిల్లర్ ముస్తఫిజుర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బాధ్యతగా ఆడిన డుప్లెసిస్ 53 బంతుల్లో 62 పరుగులు చేసి మెహదీ హసన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
మిడిలార్డర్లో డసేన్ (41), డుమిని (45) పోరాడినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి సఫారీ జట్టుపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులకే పరిమితమైంది.
బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మాన్ 3 వికెట్లు దక్కించుకోగా, సైఫుద్దీన్ 2, షకిబుల్ హసన్ ఓ వికెట్ తీశారు. షకిబుల్ హసన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
-
#RISEOFTHETIGERS
— Cricket World Cup (@cricketworldcup) June 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
BANGLADESH WIN BY 21 RUNS!
What a day for the Tigers – they hit their highest-ever ODI total before some impressive bowling saw them home 👏 👏 👏 #SAvBAN SCORECARD 👇 https://t.co/6wY1jYPAUQ pic.twitter.com/Fd8DlQwLD9
">#RISEOFTHETIGERS
— Cricket World Cup (@cricketworldcup) June 2, 2019
BANGLADESH WIN BY 21 RUNS!
What a day for the Tigers – they hit their highest-ever ODI total before some impressive bowling saw them home 👏 👏 👏 #SAvBAN SCORECARD 👇 https://t.co/6wY1jYPAUQ pic.twitter.com/Fd8DlQwLD9#RISEOFTHETIGERS
— Cricket World Cup (@cricketworldcup) June 2, 2019
BANGLADESH WIN BY 21 RUNS!
What a day for the Tigers – they hit their highest-ever ODI total before some impressive bowling saw them home 👏 👏 👏 #SAvBAN SCORECARD 👇 https://t.co/6wY1jYPAUQ pic.twitter.com/Fd8DlQwLD9
బంగ్లా అదుర్స్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాకు శుభారంభం లభించింది. మొదటి వికెట్‌కు 60 పరుగులు జోడించాక తమీమ్ ఇక్బాల్ (16) ఔటయ్యాడు. మరో ఓపెనర్ సౌమ్యా సర్కార్ 42 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో అలరించారు. ఇరువురు అర్ధసెంచరీలు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. మూడో వికెట్‌కు బంగ్లా తరఫున 142 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చివర్లో మహ్మదుల్లా (46), మిథున్ (21), మొసడెక్ హసన్ (26) ఫర్వాలేదనిపించగా బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్డేల్లో బంగ్లాకు ఇదే అత్యుత్తమ స్కోర్ కావడం విశేషం.
సఫారీ బౌలర్లలో తాహిర్, మోరిస్, ఫెహ్లుక్వాయో చెరో 2 వికెట్లు తీసుకున్నారు. టోర్నీలో దక్షిణాఫ్రికా వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పొందింది సఫారీ జట్టు.
ప్రతీకారం...
2011 ప్రపంచకప్ టోర్నీలో బంగ్లాదేశ్‌పై సఫారీ జట్టు 206 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలుపుతో దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకుంది బంగ్లాదేశ్.
ఇవీ చూడండి,.. సఫారీలతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రికార్డులు