దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్ సీనియర్ విభాగంలో మ్యాచ్‌లు ఆడనున్నాడు. టీ20 ముంబయి లీగ్‌లో తన పేరును ఆక్షన్ పూల్‌లో నమోదు చేశాడు.
దేశం తరఫున జూనియర్ విభాగంలో గతేడాది అండర్-19 టెస్టులు ఆడాడీ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు
ఈ మధ్య జరిగిన డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో ముంబయి అండర్-23 జట్టుకు ఎంపికయ్యాడు. ఇవే కాకుండా రాష్ట్రం తరఫున అండర్-14,16,19 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
తండ్రి సచిన్‌తో పాటు దేశం తరఫున ఆడిన సుబ్రతో బెనర్జీ దగ్గర పేస్ బౌలింగ్‌లో మెలకువలు నేర్చుకున్నాడు అర్జున్ తెందూల్కర్.