బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈయన 2025 వరకు నాలుగేళ్ల కాలానికి పదవిలో ఉండనున్నారు. హిమంత.. ఇప్పటికే ఆసియా బ్యాడ్మింటన్‌కు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
మొత్తం 20 స్థానాలకు గానూ 31 మంది పోటీ చేయగా.. శర్మకు 236 ఓట్లు పోలయ్యాయి. వర్చువల్‌గా జరిగిన బీడబ్ల్యూఎఫ్ సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
"నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడితో పాటు కౌన్సిల్‌కు ఎన్నికైన మిగతా సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత బ్యాడ్మింటన్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తాను" అని శర్మ తెలిపారు.
ఇదీ చదవండి: నో ఛేంజ్: బ్యాడ్మింటన్‌లో ఇకపైనా 3 గేమ్‌ల విధానమే