ETV Bharat / sitara

కరోనాపై కండలవీరుడి ర్యాప్​ సాంగ్​ - సల్మాన్​ కరోనా ర్యాప్​ సాంగ్​

భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటులు, సంగీత దర్శకులు ఇప్పటికే కరోనాపై పాటలు రూపొందించారు. బాలీవుడ్​ నటుడు సల్మాన్​ ఖాన్ తాజాగా ఆ జాబితాలో చేరాడు. కరోనాపై ఓ ర్యాప్​ పాటను రూపొందించి ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడీ కండలవీరుడు.

Salman's coronavirus-themed song Pyaar Karona out now
కరోనాపై కండలవీరుడి ర్యాప్​ సాంగ్​
author img

By

Published : Apr 21, 2020, 5:40 AM IST

కరోనా లాక్​డౌన్​పై​ ఓ పాటను రూపొందించాడు బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్. దానికి సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పంచుకున్నాడు.

కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను ఓ ర్యాప్​ సాంగ్​ ద్వారా వివరించాడు. ఇంట్లోనే ఉండటం సహా భౌతికంగా దూరంగా ఉండాలని.. అనవసరంగా వీధుల్లో వెళ్లొద్దన్న ముఖ్యమైన చర్యలను ప్రతి ఒక్క పౌరుడు పాటించాలని దీనిలో కోరాడు సల్మాన్​.

అదే విధంగా ఈ లాక్​డౌన్​లో విశ్రాంతి సమయాన్ని గిటార్​ వాయించడం, కవిత్వాలు రాయటం వంటి వ్యాపకాలతో సమయాన్ని గడపాలని ప్రజలకు సూచించాడు సల్మాన్​. ఈ సంక్షోభ సమయంలో మనకు సేవలను అందిస్తున్న వైద్య, పోలీస్​, పారిశుద్ద్య కార్మిక రంగాల వారిని గౌరవించాలని అతను కోరాడు.

ఈ పాటలోని ఓ సందర్భంలో "సారే జహాన్​ సే అచ్చా హిందూస్తాన్​ హమారా" అంటూ పాడిన విధానం అందర్ని ఆకర్షిస్తుంది. ఈ పాటను సల్మాన్​, హుస్సేన్​ దలాల్​ రచించగా.. సాజిద్​-వాజిద్​ స్వరాలు సమకూర్చారు.

ఇదీ చూడండి.. కరోనాపై చేసే యుద్ధంలో సైనికులు మీరే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.