*వెంకటేశ్ 'దృశ్యం 2' నుంచి అప్డేట్ రానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ విషయాన్ని వెల్లడించనున్నారు. అయితే ఇది రిలీజ్ డేట్ గురించే అయి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. 'దృశ్యం'కు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీతూ జోసెఫ్ దర్శకుడు.

*నాని 'శ్యామ్‌సింగరాయ్' టీజర్ నవంబరు 18న రిలీజ్ కానుంది. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబరు 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

*మోహన్‌లాల్ 'మరక్కర్' డిసెంబరు 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఆంటోని పెరంబవూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్, సునీల్ శెట్టి, మంజు వారియర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

*'రాజా విక్రమార్క' సినిమాలో 'రాజా కనవేమిరా' పాట రిలీజైంది. ఈ చిత్రం శుక్రవారం(నవంబరు 12) థియేటర్లలోకి రానుంది. 'అన్నాత్తే'లోని 'అన్నాత్తే అన్నాత్తే' పూర్తి వీడియో సాంగ్ రిలీజైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: