ETV Bharat / sitara

ఆమె పెళ్లికి పెద్దగా మారిన 'సాహో' బ్యూటీ

తన మేకప్ ఆర్టిస్ట్ పెళ్లిలో తెగ సందడి చేసింది హీరోయిన్ శ్రద్ధాకపూర్. పెళ్లి పెద్దగా వ్యవహరించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Shraddha Kapoor
శ్రద్ధా కపూర్
author img

By

Published : Jan 23, 2022, 7:05 PM IST

నటుడు శక్తికపూర్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం బాలీవుడ్‌ లక్కీలేడీగా పేరు తెచ్చుకుంది నటి శ్రద్ధా కపూర్‌. వరుస ప్రేమకథా చిత్రాలతో అలరిస్తోన్న ఈ బ్యూటీ.. 'సాహో'తో తెలుగువారికీ సుపరిచితురాలైంది. ప్రస్తుతం లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో తీస్తున్న ఓ సినిమాలో నటిస్తుంది. ఇటీవల తన స్నేహితురాలి వివాహం కోసం పెళ్లి పెద్దగా మారి.. దగ్గరుండి వివాహం జరిపించింది.

శ్రద్ధానాయక్‌ అనే మేకప్‌ ఆర్టిస్ట్‌ గత కొన్నేళ్ల నుంచి నటి శ్రద్ధాకపూర్‌కు వ్యక్తిగత మేకప్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. దీంతో శ్రద్ధాకపూర్‌తో ఆమెకు స్నేహం పెరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల శ్రద్ధానాయక్‌ తన చిన్ననాటి స్నేహితుడు రిచీని వివాహమాడారు. అయితే, వివాహ సమయంలో పెళ్లి వేదికపై శ్రద్ధాకపూర్‌ పెద్దగా వ్యవహరించారు.

Shraddha Kapoor turns officiator
శ్రద్ధా కపూర్

"ఈ పెళ్లి చేసుకోవడం మీకు సమ్మతమేనా?" అని వధూవరులను శ్రద్ధాకపూర్ ప్రశ్నించింది. వధూవరులిద్దరూ అంగీకారం తెలపడం వల్ల "ఇక మీరు వధువును ముద్దాడవచ్చు" అంటూ నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియోను శ్రద్ధా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. పెళ్లి పెద్దగా వ్యవహరించిన తన మిత్రురాలికి ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.