ఆరోగ్యకర జీవనం సాగించాలని ఎవరికుండదు చెప్పండి. అందుకోసం ఫిట్నెస్ చాలా ముఖ్యం. జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసే ఓపిక అందరికీ ఉండదు. అలాంటి వారి కోసం మొబైల్ యాప్‌లు చాలానే వచ్చాయి. తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సొంతగా ఓ యాప్ ప్రారంభించనుంది.
"ఆరోగ్యకర జీవితం గడపడానికి ప్రజలకు సాయం చేద్దామనుకుంటన్నా. వారికి సరైన మార్గదర్శకత్వం కావాలని ఆలోచించా. అందుకే నా అనుభవాలతో పాటు అనుభవజ్ఞుల సలహాలతో ఓ యాప్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నా. జిమ్‌కు వెళ్లకుండానే ఇంటి వద్దే మీరు ఫిట్నెస్ సాధించొచ్చు. ప్రారంభదశలో ఉన్నవారి నుంచి ప్రొఫెషనల్ అథ్లెట్స్ వరకు అందరికీ ఇది ఉపయోగపడుతుంది".
-శిల్పా శెట్టి, బాలీవుడ్ నటి
యాప్‌లో ఫిట్నెస్తో పాటు యోగా, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆపిల్ యూజర్లకు నేటి నుంచి, ఆండ్రాయిడ్ వినియోగదారులకు జూన్ 8 నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది.