కరోనా సంక్షోభ సమయంలో వీరోచిత పోరాటం చేస్తున్న మహిళామణులకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు సిద్ధమైంది ప్రముఖ బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా. ఈ మహమ్మారిపై పోరాడుతున్న వివిధ రంగాలకు చెందిన మహిళలను, ప్రతివారం నలుగురు చొప్పున ఎంపిక చేసి వారందరికీ కలిపి లక్ష డాలర్లను ఇవ్వనుంది. తొలివారం ఎంపికైన నలుగురి వివరాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కుటుంబ సంక్షేమం కోసం వారికి దూరంగా ఉంటూనే వృత్తి ధర్మం నిర్వర్తిస్తున్న ఎమిలీ అనే నర్సు, కరోనా రోగులకు తోడుగా ఉంటూ ధైర్యం నూరిపోస్తున్న జో అనే ఉద్యోగిని, ఎన్95 మాస్కులను అందించడానికి తన డబ్బుతో పాటు విలువైన సమయాన్నీ వెచ్చించిన జయ అనే మహిళ, ఫీడింగ్ హీరోస్ కార్యక్రమం ద్వారా వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆహారం అందిస్తున్న జెన్నీ అనే మహిళకు ప్రోత్సాహక నగదును అందించనున్నట్లు ప్రకటించింది ప్రియాంక. ప్రజల ప్రాణాల కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న వారికి అండగా నిలుస్తున్న ఈ నటిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇదీ చదవండిః 'పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నా'