ప్రియాంక చోప్రా భర్త నిక్ జొనాస్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'మిడ్‌వే'. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇండిపెండెన్స్ డే, 2012 లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రొనాల్డ్ ఎమ్మరిచ్ ఈ చిత్రానికి దర్శకుడు.

యుద్ధ విమానాల నిర్వహణను పర్యవేక్షించే బ్రూనో గైడో అనే అధికారిగా నిక్ జొనాస్ కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన నిక్ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. విదేశాలతో పాటు భారత్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
-
Dive into the battle that changed WWII with our latest work for #MidwayMovie. pic.twitter.com/qN97Weh6BA
— LAssociates (@the_la_agency) October 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dive into the battle that changed WWII with our latest work for #MidwayMovie. pic.twitter.com/qN97Weh6BA
— LAssociates (@the_la_agency) October 10, 2019Dive into the battle that changed WWII with our latest work for #MidwayMovie. pic.twitter.com/qN97Weh6BA
— LAssociates (@the_la_agency) October 10, 2019
నిక్ జొనాస్ అంతకుముందు 'కేర్ ఫుల్ వాట్ యూ వీష్ ఫర్', 'జుమాంజీ- వెల్కమ్ టు ది జంగిల్' లాంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. రొలాండ్ ఎమ్రిచ్ గాడ్జిల్లా, 10,000 బీసీ, వైట్ హౌస్ డౌన్, ద డే ఆఫ్టర్ టుమారో లాంటి హిట్ చిత్రాలనూ తెరకెక్కించాడు.
ఇదీ చదవండి: ఆ సమయంలో జబర్దస్త్ అవకాశం వచ్చింది :రష్మీ