నేచురల్ స్టార్ నాని హీరోగా.. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలు. ఇటీవలే కోల్‌కతాలో సుదీర్ఘ షెడ్యూల్ జరుపుకొంది. తాజాగా ఈరోజు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్లో నాని ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది.

దీంతో పాటు 'టక్ జగదీష్' అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు నాని. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేశారు. ఏప్రిల్ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.