ETV Bharat / sitara

'వి' లో నేచురల్ స్టార్ మరో యాంగిల్ ఇదే!

author img

By

Published : Sep 4, 2020, 4:46 PM IST

నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'వి'. శనివారం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని ఈ మూవీలోని ఓ స్పెషల్‌ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

'వి' లో నేచురల్ స్టార్ మరో యాంగిల్ ఇదే!
'వి' లో నేచురల్ స్టార్ మరో యాంగిల్ ఇదే!

నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'వి'. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. నివేదా థామస్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. శనివారం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

నాని ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌లో గుబురు గడ్డం, మెలి తిరిగిన మీసంతో కనిపించిన నాని తాజా ఫొటోలో లవర్‌బాయ్‌లా అందంగా కనిపించాడు. అదితిరావు హైదరీని కౌగలించుకుని చిరు నవ్వులు చిందిస్తున్న ఫొటో ఆకట్టుకుంటోంది.

అయితే, ట్రైలర్‌లో నాని పూర్తి భిన్నంగా ఉండటం విశేషం. మరి నాని విలన్‌గా మారడానికి కారణం ఎవరు? ఎలాంటి పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది? తుపాకి పట్టిన తర్వాత ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.