హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. ఇటీవలే 'అర్జున్ సురవరం'తో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో విభిన పాత్రలో నటిస్తుంది. సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్‌ప్రెస్'లో హాకీ ప్లేయర్‌గా కనిపించనుంది. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను పంచుకుంది చిత్రబృందం. ఇందులో లావణ్య రావు అనే క్రీడాకారిణిగా నటిస్తోంది.

తమిళ సినిమా 'నట్పే తునై'కు రీమేక్‌గా తెరకెక్కుతోందీ 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే హాకీ కథతో రూపొందిస్తున్నారు. హిప్ అప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇది చదవండి: తొలిసారి హాకీ ప్లేయర్‌గా సందీప్ కిషన్